News February 7, 2025

సంగారెడ్డి: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్నిరోజులుగా సంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్‌లో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి.

Similar News

News February 7, 2025

సిరిసిల్ల: డైరీ, టెక్స్‌టైల్ ఎగుమతులు పెంచాలి: కలెక్టర్

image

డైరీ, టెక్స్ టైల్ రంగాల్లో ఎగుమతుల పెంపునకు కృషిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవెల్ ఎకోస్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.

News February 7, 2025

జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.

News February 7, 2025

ఇన్ఫో‌సిస్‌లో మరోసారి లేఆఫ్స్?

image

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో‌సిస్‌ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

error: Content is protected !!