News March 14, 2025
సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్‌గా సమర్పించాలని తెలిపారు.
Similar News
News March 14, 2025
‘ఛావా’ కలెక్షన్ల ప్రభంజనం

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీలో 4 వారాల్లో రూ.540.38 కోట్లు, తెలుగులో తొలి వారంలో రూ.11.80 కోట్లు వసూలు చేసింది. హోలీ హాలిడే, వీకెండ్ కావడంతో ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
News March 14, 2025
VZM: మఫ్టీలో రంగంలోకి దిగిన శక్తి టీమ్స్

విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించారు. మఫ్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన కల్పించారు. మహిళలతో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.
News March 14, 2025
SKLM: ఈనెల 20న తపాలా అదాలత్

శ్రీకాకుళం: పోస్టల్ సేవలకు సంబంధించి వ్యక్తిగత ఫిర్యాదుల కోసం ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీ హరిబాబు శుక్రవారం తెలిపారు. ఫిర్యాదులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి ఈనెల 20 లోపు అందే విధంగా పంపించాలన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించబడవని వివరించారు.