News February 4, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు
సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఐదు రోజుల సీసీఎల్ మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సాధారణ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవి వర్తిస్తాయన్నారు. దీంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 4, 2025
రెండు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి
కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామ మాజీసర్పంచ్ మట్టూరి సీతారత్నం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఈమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండురోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 4, 2025
ప.గో: నగ్న చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా
అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్‌కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. యువతి నగ్న చిత్రాల తన వద్ద ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి వద్ద రూ.1.84 కోట్ల నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.
News February 4, 2025
NZB: జిల్లా వాసికి సిల్వర్ మోడల్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్టేట్ మీట్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ నీతా రెడ్డిని ఖైరతాబాద్ సీఐడీ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నీతా రెడ్డి హైదరాబాదులోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్ సాధించడంతో ఆమెను ప్రశంసించారు.