News April 4, 2025
సంగారెడ్డి: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 20 నుంచి 26 వరకు జరిగే ఓపెన్ స్కూల్ 10 ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్లో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షల్లో చూచి రాతకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకటస్వామి పాల్గొన్నారు.
Similar News
News April 12, 2025
వనపర్తి: హనుమాన్ జయంతికి పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ గిరిధర్

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు, ప్రజలు సంతోషంగా శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఇతర మతస్థులను గౌరవిస్తూ తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని అన్నారు.
News April 12, 2025
MNCL: రెండు గంజాయి కేసుల్లో ఇద్దరు ARREST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు గంజాయి కేసుల్లో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గత నెల 11న రాళ్లవాగు ఏరియాలో పాత మంచిర్యాలకు చెందిన కోట దినేష్ నాగేందర్ వద్ద 170 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. అలాగే ఈ నెల 10న వంద ఫీట్ల రోడ్డు ఏరియాలో గంజాయి విక్రయిస్తున్న కామెర అమిన్ ను పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సైలు కిరణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, వినీత తెలిపారు.
News April 12, 2025
ADB జిల్లా కోర్టులో PPలు వీరే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది అబ్దుల్ రహీం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మరో న్యాయవాది ప్రవీణ్ కుమార్ పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వీరిద్దరి పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఈ సందర్భంగా వీరికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.