News March 6, 2025
సంగారెడ్డి: క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం: కలెక్టర్

క్రీడలు ఆడడం వల్ల మహిళల్లో ఆత్మహత్య పెరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను బుధవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులతో ఉత్సాహంగా కలెక్టర్ క్యారం బోర్డు ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆటలు చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. డీఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తాం: CM CBN

భారత్‌లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి AP నాయకత్వం వహిస్తుందని CM CBN అన్నారు. క్వాంటం, దాని అనుబంధ రంగాల్లో 14లక్షల మంది నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని ‘క్వాంటం టాక్ బై CM CBN’ కార్యక్రమంలో తెలిపారు. ‘క్వాంటం టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి. AP నుంచి ఎవరైనా ఈ టెక్నాలజీ ద్వారా నోబెల్ సాధిస్తే రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
News December 23, 2025
RECORD.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాకే!

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.872 కోట్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹857Cr), కాంతారా: చాప్టర్-1 (₹852Cr), చావా (₹807Cr) కలెక్షన్లను బీట్ చేసింది. యానిమల్ (₹915Cr ), బజరంగీ భాయిజాన్ (₹918cr) కలెక్షన్లను దాటేసి టాప్-10 ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్టులో చేరే అవకాశముంది.
News December 23, 2025
కడప: ఈ క్రాప్ సరే.. బీమా నమోదు ఎప్పుడు?

ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 77,221 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు వ్యవసాయ సిబ్బంది ప్రస్తుతం ఈ క్రాప్ చేపడుతున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల మధ్య పంటలు నష్టపోతే తగిన పరిహారం పొందేందుకు బీమా చేసుకోవాలని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంతవరకు NICP, పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


