News March 25, 2025

సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

image

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News March 29, 2025

నిమ్స్‌లో ఉచితంగా పీడియాట్రిక్ గుండె శస్త్ర చికిత్సలు

image

HYD నిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు అమరేష్ రావు తెలిపారు. తెలంగాణకు చెందిన చిన్నారులతోపాటు ఇక్కడ సెటిల్ అయిన TG, AP ఆధార్ కార్డు ఉన్న కుటుంబాల చిన్నారులకు గుండె సమస్యలు ఉన్నట్లయితే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని, వివరాలకు ఆస్పత్రిలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 29, 2025

IPL: నేడు ముంబైVSగుజరాత్

image

IPLలో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. మూడింట్లో GT, రెండింట్లో MI గెలిచింది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌ను రెండు జట్లు ఓటమితోనే ఆరంభించాయి. నేడు గెలుపు బోణీ కొట్టేదెవరో?

News March 29, 2025

MDCL: స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుక

image

కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఉగాది కానుకగా, బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి ఒక్క రూపాయి వడ్డీని తిరిగి చెల్లించే నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సంబంధిత బ్యాంకుల ఖాతాల్లో జమ చేయించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.5.66 కోట్లు చెల్లించి, జిల్లాలోని 3910 స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం చెల్లించిన వన్ రూపీ వడ్డీ తిరిగి చెల్లించడం జరిగిందని అధికారులు తెలిపారు.

error: Content is protected !!