News March 25, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళపై అత్యాచారం

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కంది మండలం మామిడిపల్లి పరిధిలో మంగళవారం తెల్లవారుజామున మహిళ(30)పై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆమె భర్త పైనా నిందితులు దాడి చేశారు. భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 30, 2025

KMM: పండగపూట ఆకాశాన్నంటుతున్న బంతి ధర

image

జిల్లాలో ఉగాది పండుగ వేళ బంతిపూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంతిపూలు ఒక కిలో రూ.100 నుంచి 200 ధర పలుకుంది. తెలుగు ప్రజలకు ఉగాది కొత్త పండగతో కావడంతో ఇళ్లలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ కారణం చేత ప్రజలు తప్పనిసరిగా బంతిపూలతో పాటు ఇతర పూలను కొనుక్కోవాల్సిన పరిస్థితి. అవకాశాన్ని ఆదాయంగా మార్చుకున్న పూల వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచారని ప్రజలు అంటున్నారు.

News March 30, 2025

నేడు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గాన IPL మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రామ్‌నగర్‌లో గల ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. వీటికి తగ్గట్టు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

News March 30, 2025

సంగారెడ్డి: 115 ఏళ్ల వృద్ధురాలు మృతి

image

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన బైండ్ల నాగమ్మ శతాధిక వృద్ధురాలు మరణించారు. ఆమె వయసు 115. ఇప్పట్లో ఇన్నేళ్లు బతకడం చాలా కష్టమని ప్రజలు చెప్పుకుంటున్నారు. అప్పటి వారు చాల గట్టి మనుషులని, ఇప్పటి తరం వారు చిన్న చిన్న వ్యాధులతో మృతి చెందుతున్నారని చెప్పారు. ఇంతకాలం బతకడం అదృష్టమని వివరించారు.

error: Content is protected !!