News March 7, 2025
సంగారెడ్డి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫలితాలు విడుదల

జిల్లాలో జనవరి నెలలో నిర్వహించిన లోయర్, హయర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. ఈ పరీక్షా ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు.
Similar News
News March 7, 2025
నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు

TG: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను అధికారులు ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానున్నారు. https://bse.telangana.gov.in సైట్‌లో విద్యార్థులు లాగిన్ అయి హాల్ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
News March 7, 2025
తిరుపతి: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కాని విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
News March 7, 2025
చిత్తూరు: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కానీ విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.