News February 12, 2025
సంగారెడ్డి: టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్‌లో 25 , మెదక్ డివిజన్‌లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 12, 2025
మంచిర్యాలలో యువతి అదృశ్యం
మంచిర్యాలలోని ఏసీసీ చెందిన 22 ఏళ్ల యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. తిరుపతి, సుమలత దంపతుల కుమార్తె(22) తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతుంటే తల్లి మందలించింది. దీంతో ఈ నెల 4న ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News February 12, 2025
తిరుపతి: టెన్త్ అర్హతతో 99 ఉద్యోగాలు
టెన్త్ అర్హతతో తిరుపతి డివిజన్‌లో 59, గూడూరు డివిజన్‌లో 40 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
HYD: అమ్మాయిలు.. అలా చేస్తే ఊరుకోకండి: డీసీపీ
కొద్దిపాటి పరిచయం ఉన్నవారితోనూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రహస్యంగా అమ్మాయిల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవ్వరికీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంపొద్దని HYD సైబర్ క్రైమ్ డీసీపీ కవిత సూచించారు. టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని, నగ్న విడియోలతో వేధింపులకు గురి చేస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని 100, 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.