News January 21, 2025
సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు రాసేవారికి చివరి ఛాన్స్
ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగియనుందని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో కలిపి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు రేపటి వరకు చెల్లించాలన్నారు. ఇదే చివరి తేదీ అని, ఇక మీదట పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2025
ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ 6.9, అల్గోల్ 7.9, న్యాల్కల్ 8.7, అల్మాయిపేట 9.0, మల్చల్మ 9.6, కంకోల్, సత్వార్ 9.7, లక్ష్మీసాగర్ 9.8, దిగ్వాల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ 10.0, కంది 10.2, కంగ్టి, మొగుడంపల్లి 10.3, పుల్కల్, ఝరాసంఘం 10.4, అన్నసాగర్ 10.5, బోడగాట్ 10.7, కల్హేర్ 10.8, దామరంచ, పోతారెడ్డిపేట, చౌటకూరు, సిర్గాపూర్ 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News January 22, 2025
రైల్వే ట్రాక్‌పై సిద్దిపేట అమ్మాయి తల, మొండెం (UPDATE)
HYD జామై ఉస్మానియాలో<<15212796>>అమ్మాయి సూసైడ్<<>> కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 22, 2025
సాంకేతికను అందిపుచ్చుకుందాం: కలెక్టర్ క్రాంతి
సాంకేతికను అందిపుచ్చుకుందామనిని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కందిలోని ఐఐటి హైదరాబాద్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. ఐఐటి హైదరాబాద్‌లో ఎన్నో ప్రయోగాత్మక పరిశోధన చేసి విజయం సాధించారని పేర్కొన్నారు. సమావేశంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.