News March 29, 2025
సంగారెడ్డి: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ శిక్షణ కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు అర్హులని చెప్పారు. తెల్ల రేషన్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 2, 2025
బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి: SP

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని భ్రమలో యువత, ప్రజలు విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని ఆన్నారు.
News April 1, 2025
MDK: వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్ నంబర్లు

మెదక్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు సహాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, పీఏలకు సంబంధించిన అధికారుల నంబర్లు మారినట్లు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదివరకు ఐడియా వొడాఫోన్ నంబర్లు ఉండగా ఎయిర్ టెల్‌లోకి మారాయి.