News February 21, 2025

సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

image

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.

Similar News

News February 22, 2025

విదేశీ జోక్యం: కాంగ్రెస్‌పై దాడి పెంచిన BJP

image

USAID నిధులపై <<15542230>>ట్రంప్<<>> వివరాలు చెప్పే కొద్దీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై BJP విమర్శల తీవ్రతను పెంచుతోంది. వాటిని ప్రతిపక్షాల గెలుపు కోసమే బైడెన్ కేటాయించినట్టు ఆరోపిస్తోంది. ED, CBI, ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది. గతంలో పదేపదే USకు వెళ్లే RG ఇప్పుడెందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యం నాశనమవుతోందంటూ అక్కడ ఆయన అంతర్జాతీయ సమాజ జోక్యం కోరడాన్ని గుర్తుచేస్తోంది.

News February 22, 2025

GOOD NEWS.. నెలకు రూ.7500?

image

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.

News February 22, 2025

నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

image

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.

error: Content is protected !!