News February 12, 2025

సంగారెడ్డి: త్వరలో హరీశ్ రావు పాదయాత్ర

image

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు భూసేకరణ దశలో నిలిచిపోయాయని, తిరిగి పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపడతామన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో హరీశ్ రావు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

Similar News

News February 12, 2025

వినుకొండ: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో అంబేడ్కర్ నగర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని తెలిపారు.

News February 12, 2025

‘ఉద్యాన పంటల సాగు పెంపునకు కృషి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 12, 2025

15న అమరచింతకు జాన్ వెస్లీ రాక

image

అమరచింతకు ఈనెల 15న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నట్లు ఆత్మకూరు సీపీఐ(ఏం) మండల కార్యదర్శి ఎస్ రాజు పేర్కొన్నారు. అమరచింతలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అభినందన సభ ఉంటుందన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ నూతన సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

error: Content is protected !!