News April 25, 2025
సంగారెడ్డి: దరఖాస్తులకు రేపే చివరి తేదీ: డీఈవో

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు రేపటి లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.
Similar News
News January 20, 2026
మంచిర్యాల: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పార్టీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆయా వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. CONGతో పొత్తు కొనసాగిస్తున్న CPI జిల్లాలోని కార్పోరేషన్, మున్సిపాలిటీలోని పలు వార్డులలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రధానంగా 4 పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మేయర్, ఛైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకొని పోటీ పడనున్నట్లు సమాచారం.
News January 20, 2026
బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న విజయనగరం మత్స్యకారులకు విముక్తి

బంగ్లాదేశ్ జైళ్లలో గత 3 నెలలుగా బందీగా ఉన్న విజయనగరం(D)కు చెందిన 9 మంది మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. విశాఖ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన ఎంఎం-735 మెకనైజ్డ్ బోటు, ఇంజిన్ చెడిపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి కొట్టుకుపోయింది. దీంతో ఆ దేశ కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులను అరెస్టు చేసింది. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కృషితో విడుదల సాధ్యమైంది.
News January 20, 2026
HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<


