News March 10, 2025

సంగారెడ్డి: నేటి నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్

image

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 10 నుంచి ఇంటర్మీడియట్ వాల్యూయేషన్ చేయనున్నట్లు జిల్లా అధికారి గోవిందారం తెలిపారు. 10న సంస్కృతం, 22న ఫిజిక్స్, 24న ఎకనామిక్స్, 26న కెమిస్ట్రీ, కామర్స్, 28న చరిత్ర, బాటని, జువాలజీ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

Similar News

News March 10, 2025

BIG BREAKING: నిలిచిపోయిన X సేవలు

image

ప్రపంచ వ్యాప్తంగా X(ట్విటర్) సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్‌లోకి లాగిన్ కాలేక, లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక అసౌకర్యానికి లోనవుతున్నారు. దాదాపు అరగంట నుంచి ట్విటర్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ సేవలు నిలిచిపోయాయా? కామెంట్ చేయండి. దీనిపై సదరు సంస్థ ఇంకా స్పందించలేదు.

News March 10, 2025

బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిన నార్త్ కొరియా

image

నార్త్ కొరియా మరోసారి దాని చుట్టుపక్కల ఉన్న అమెరికా మిత్రదేశాల్లో గుబులు రేపింది. పలు బాలిస్టిక్ క్షిపణుల్ని సముద్రంలోకి ప్రయోగించింది. సియోల్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా బలగాలు కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాల్ని ప్రారంభించాయి. అవి తమను ఆక్రమించడానికే అని ఆరోపిస్తున్న ప్యాంగ్యాంగ్, వాటికి హెచ్చరికగా సముద్రంలోకి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.

News March 10, 2025

కరీంనగర్: 322 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!