News December 14, 2024
సంగారెడ్డి : నేటి లోక్అదాలత్ జిల్లా వ్యాప్తంగా 7బెంచీలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. సంగారెడ్డిలో మూడు బెంచీలు, జోగిపేటలో ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, జహీరాబాద్ ఒకటి, మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు, కేసు పెండింగ్లో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 27, 2024
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. 20ఏళ్లు జైలు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్‌కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజనీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
News December 27, 2024
సిద్దిపేట: స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్: మంత్రి పొన్నం
స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.
News December 26, 2024
మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించిన హరీశ్‌రావు
నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీశ్‌రావు. అనంతరం జగన్నాథం ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హరీశ్‌రావు తెలుసుకున్నారు.