News February 15, 2025

సంగారెడ్డి: నేను పుస్తకాలు చదవలేదు: జగ్గారెడ్డి

image

యువతకు ఉపయోగపడే ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురావాలని తాను బీజేపీ ఎంపీలకు అడిగితే.. తనకు ఐటీఐఆర్ ఫుల్‌ఫాం తెలియదంటూ ఎద్దేవా చేయడం ఎంపీ రఘునందన్‌రావుకు తగదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజంగా తాను పుస్తకాలు చదువుకోలేదని కేవలం ప్రజల మనస్తత్వం మాత్రమే చదివానని చెప్పారు. గాంధీ భవన్‌లో మీడీయాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందికి ఐఐటీ తీసుకువచ్చానన్నారు.

Similar News

News March 13, 2025

మెదక్‌లో మహిళలు మిస్..

image

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 13, 2025

మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

image

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.

News March 13, 2025

మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

image

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

error: Content is protected !!