News March 20, 2025
సంగారెడ్డి: ‘పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్‌లు బంద్’

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.
Similar News
News March 22, 2025
వనపర్తి: ‘మట్టి స్నానంతో చర్మ వ్యాధులు దూరం’

ఆయుర్వేదిక్ మట్టి స్నాన కార్యక్రమానికి వనపర్తి జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ను యోగా థెరపిస్ట్ శ్రీను నాయక్ కరపత్రాన్ని అందజేసి ఈరోజు ఆహ్వానించారు.. జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈనెల 23న రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో నిర్వహించే మట్టి స్నానంతో వివిధ రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 22, 2025
వనపర్తి: ఆత్మకూరులో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా ఆత్మకూరు, కానాయిపల్లిలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేర్ 38.5, దగడ 38.4, అమరచింత 38.3, మదనాపూర్ 38.2, విలియంకొండ 38.1, పెద్దమందడి 37.9, పానగల్ 37.8, రేమద్దుల 37.6, వెలుగొండ 37.5, వనపర్తి 37.4, జానంపేట 37.2, శ్రీరంగాపూర్ 37.0, గోపాల్‌పేట 36.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 22, 2025
ఎంపురాన్ కోసం హీరో, డైరెక్టర్ కీలక నిర్ణయం

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘L2:ఎంపురాన్’. <<15821261>>ట్రైలర్‌తోనే<<>> ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కోసం తాను, మోహన్ లాల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఆ మొత్తాన్ని మూవీ క్వాలిటీ కోసం వెచ్చించినట్లు చెప్పారు. మలయాళ సినీ పరిశ్రమ చిన్నదైనా టాప్ టైర్ ప్రొడక్షన్ క్వాలిటీతో సినిమాలు చేస్తున్నామన్నారు.