News March 19, 2025
సంగారెడ్డి: పరీక్షకు 96.63% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.63% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.18,616 మంది విద్యార్థులకు గాను 17,989 మంది విద్యార్థులు హాజరయ్యారని, 627 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉండాలా? వద్దా?

IPL-2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని, ఆల్‌రౌండర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రూల్ ప్రవేశపెట్టాక 2023లో ఒకసారి, 2024లో 8 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఒకసారి మాత్రమే (2013లో) 250+ నమోదైంది. 2024లో జట్ల రన్‌రేట్ 9.56గా ఉండగా 2022లో 8.54గానే ఉంది. దీనిపై మీ కామెంట్.
News March 20, 2025
ASF: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే JOB MELA

నిరుద్యోగులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం పట్టణంలోని రోజ్ గార్డెన్‌లో 1000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆమె బుధవారం తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలైన(SSKD, ఫాక్స్‌కాన్, యాపిల్ సంస్థ)లో అర్హత కలిగి ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. నిరుద్యోగ యువతులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
News March 20, 2025
125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.