News February 1, 2025

సంగారెడ్డి: పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడి, కేజీబీవి, ఆదర్శ పాఠశాలలకు రెండవ విడత పాఠశాల నిర్వహణ గ్రాంటు నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గతంలో 50శాతం నిధులు విడుదల కాగా మిగతా 50శాతం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నిధులను పాఠశాల ఎస్ఎంసీ ఖాతాలో జమ చేశామని చెప్పారు.

Similar News

News March 4, 2025

ఉత్తరాంధ్ర టీచర్ల MLC ఎన్నిక.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

image

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656

News March 4, 2025

MLC ఎన్నికలు.. అప్పుడు PRTU.. ఇప్పుడు BJP

image

టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందారు. మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోలు కాగా.. 24,144 చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. మల్క కొమురయ్య 12,959, వంగ మహేందర్‌రెడ్డి 7,182, అశోక్‌కుమార్‌ 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గతంలో PRTU బలపరిచిన రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి బీజేపీ గెలిచింది.

News March 4, 2025

లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

image

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.

error: Content is protected !!