News March 10, 2025
సంగారెడ్డి: ప్రణాళికతో చదివితే మంచి మార్కులు

పదవ తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివితే మంచి మార్కులు వస్తాయని ఎస్టీవో శారద అన్నారు. సంగారెడ్డిలోని సాంఘిక సంక్షేమ విద్యార్థులకు అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. పరీక్షలు రాసే విధానం పరీక్షలకు, ఎలా సిద్ధం కావాలో తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు రమేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
News December 13, 2025
వాటిని పెద్దగా పట్టించుకోను: వైభవ్ సూర్యవంశీ

2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుడిగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ నిలిచారు. ఈ క్రమంలో పాపులారిటీలో కోహ్లీని కూడా దాటేశారన్న వార్తలపై వైభవ్ స్పందించారు. ‘వీటిని పెద్దగా పట్టించుకోను. నా దృష్టి ఆటపైనే. ఇలాంటి వార్తలు విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. వాటిని చూసి ఆనందపడతాను. తర్వాత పనిలో పడిపోతా’ అని చెప్పారు. UAEతో మ్యాచ్‌లో వైభవ్ 171(95) పరుగులతో <<18542043>>విధ్వంసం<<>> సృష్టించారు.
News December 13, 2025
తంగళ్ళపల్లి: 700 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.


