News April 2, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని 122 పరీక్ష కేంద్రాల్లో మార్చి 21 నుంచి నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 22,412 మంది విద్యార్థులకు గానూ 22,371 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
MBNR: ముగ్గురిపై కేసు నమోదు

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం బిల్డింగ్‌తండా గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నిర్వహించారు. ఈ సమయంలో బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ లెనిన్‌తో బిల్డింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కోయిలకుంట తండాకు చెందిన ముగ్గురు దురుసుగా ప్రవర్తించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 4, 2025
గద్వాల: చికిత్స పొందుతూ మృతి

స్వచ్ఛంద సంస్థలో పని చేస్తూ మహిళకు ఆపద వచ్చిందంటే సామాజిక సేవలో ముందుడే జయభారతి గురువారం రాత్రి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకొని ప్రమాదం జరగగా మెరుగైన చికిత్స కోసం అపోల ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News April 4, 2025
నారాయణపేటలో ఐదుగురిపై కేసు నమోదు

నారాయణపేట పట్టణంలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రేవతి తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. వాహనాలకు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.