News March 28, 2024
సంగారెడ్డి: బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.
Similar News
News April 21, 2025
మెదక్: BRS నేతలపై కేసు నమోదు

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ చిత్రలేఖనం గీసిన బీఆర్ఎస్ నాయకులపై హావేళి ఘణపురం మండల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నేతలు ఆర్.కె.శ్రీను, జుబేర్, ఫాజిల్లపై కేసు నమోదు చేశారు.
News April 20, 2025
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై ఎస్పీకి ఫిర్యాదు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసిన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
News April 20, 2025
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి: మెదక్ కలెక్టర్

ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కుల్చారం మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీవో మహిపాల్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూభారతి చట్టంపై పాటలతో అవగాహన కల్పించారు.