News January 30, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News March 13, 2025
ఉండవెల్లి: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.!

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మధు(21) అనే యువకుడు జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలోని కర్నూలు వైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ పెళ్ళికి వెళ్లి తన అన్న వాసుకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్య గల వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2025
పెద్దపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన: విద్యాశాఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనపై వీడియో కాన్ఫరెన్స్‌ను విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించారు. మార్చి 15 నుంచి జిల్లాలలో ఎంపికచేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశించారు. 3-5వ తరగతి విద్యార్థులకు సామర్థ్యాల పెంపు లక్ష్యం అన్నారు. VCలో PDPL కలెక్టర్ పాల్గొన్నారు.
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్‌లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.