News March 29, 2025

సంగారెడ్డి: యుద్ధ ట్యాంకర్ల తయారీకి ఒప్పందం

image

దేశ రక్షణలో ఎంత ఉపయోగపడే యుద్ధ ట్యాంకర్ల తయారీకి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆయుధ కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. మిస్సెల్ పేరిట 293 యుద్ధ ట్యాంకర్లు, నామిస్ పేరుతో 13 అత్యాధునిక ట్యాంకర్ల తయారీకి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటిపై కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్, ఓడిఎఫ్ సంస్థ చీఫ్ జీఎం శివశంకర ప్రసాద్ సంతకాలు చేశారు.

Similar News

News April 2, 2025

పెద్దాపురం: కాండ్ర‌కోట నూకాల‌మ్మ జాత‌ర‌లో విషాదం

image

పెద్దాపురం మండ‌లం కాండ్ర‌కోట నూకాల‌మ్మ జాతర‌లో విషాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి ఇద్ద‌రు ఏలేరు కాలువ‌లోకి స్థాన్నానికి దిగి గ‌ల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ‌, జ‌గ‌న్నాధ‌పురం బిర్యానీ పేట‌కు చెందిన పిర‌మాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్ద‌రి గల్లంతవ్వగా బాలుడు మృత‌దేహం బుధ‌వారం ల‌భ్య‌మైంది. మరో మృత‌దేహం కోసం పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వ‌ర్యంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

News April 2, 2025

‘తల్లికి వందనం’ వారికే ఇవ్వాలని చెప్తే CM ఒప్పుకోలేదు: జ్యోతుల నెహ్రూ

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ అమలు చేయాలని CM చంద్రబాబుకు చెబితే ఆయన ఒప్పుకోలేదని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. దీంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతాయని చెప్పినా వినలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పథకం వర్తింపజేస్తామని సీఎం చెప్పినట్లు వివరించారు. కాగా, జూన్ 12లోపు ‘తల్లికి వందనం’ అమలు చేస్తామని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.

News April 2, 2025

ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ.. ఎప్పుడంటే?

image

US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు(భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్‌హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

error: Content is protected !!