News February 24, 2025

సంగారెడ్డి: రంజాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే చోట్ల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పి రూపేష్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2025

మేడ్చల్: టీచర్లకు కలెక్టర్ కీలక సూచనలు..

image

పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయూతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. సోమవారం కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.

News February 25, 2025

రావణ, మయూరి వాహనంపై దర్శనమిచ్చిన కైలాసనాధుడు

image

శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల్లో సందర్బంగా 4వ రోజు సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడి రావణ, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మయూరి వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధుల్లో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు.

News February 25, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ 48 గంటలపాటు నిశ్శబ్ద వ్యవధి అమలు: జిల్లా కలెక్టర్ ✓ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి: AIKMS ✓ కల్తీ పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ✓ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి: ఐటీడీఏ పీఓ ✓ దమ్మపేటలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ✓ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ✓ జూలూరుపాడులో చెరువుల కబ్జాపై సర్వే ✓ ఆళ్లపల్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురికి గాయాలు

error: Content is protected !!