News February 24, 2025
సంగారెడ్డి: వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40), న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
ACBకి పట్టుపడ్డ పాలకొండ మున్సిపల్ కమిషనర్

పాలకొండ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ వలకు చిక్కినట్లు తెలుస్తోంది. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో మిస్టేక్స్ సరిదిద్దేందుకు డాక్టర్ రౌతు భారతి నుంచి కమిషనర్ సూచనల మేరకు అతని డ్రైవర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంది. దీంతో కమిషనర్‌ను ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2025
KCR, హరీశ్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో BRS అధినేత KCR, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై భూపాలపల్లి క్రిమినల్ కోర్టు కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.
News February 24, 2025
ATP: PGRS కార్యక్రమంలో 502 అర్జీలు

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొని ప్రజల నుంచి 502 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PGRS అర్జీలను సంబంధిత గడువులోపే పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచరాదని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులంతా జవాబుదారీతనంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని వివరించారు.