News April 22, 2025
సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
RRvsLSG: రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

IPL: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్‌లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
News April 22, 2025
జనాభా పెంచేందుకు ట్రంప్ చర్యలు!

అమెరికాలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఐడియాస్ సేకరిస్తున్నారట. వాటిలో తొలి బిడ్డను కంటే బేబీ బోనస్‌గా 5 వేల డాలర్లు, రెండో బిడ్డను కంటే ట్యాక్స్ క్రెడిట్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. బర్త్ కంట్రోల్ అవసరం లేకుండానే అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.
News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.