News March 29, 2025
సంగారెడ్డి సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా జడ్జి

కందిలోని సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలును జిల్లా జడ్జి భవాని చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని వంటగది స్టోర్ రూం పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఎవరికైనా న్యాయ సాయం కావాలంటే ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆమె వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, జైలు సిబ్బంది ఉన్నారు.
Similar News
News April 2, 2025
పోలీసులతో బెదిరించినా తెగువ చూపారు.. హ్యాట్సాఫ్: YS జగన్

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహంకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని YCP అధినేత జగన్ అన్నారు. ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. ఉప ఎన్నికల్లో మన కార్యకర్తలు చూపిన తెగువ, ధైర్యానికి హ్యాట్సాఫ్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచాం. TDPకి సంఖ్యా బలం లేకున్నా పోలీసులతో బెదిరించారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వ్యాఖ్యానించారు.
News April 2, 2025
స్టూడెంట్ తండ్రికి టీచర్ ముద్దులు.. చివరకు..

బెంగళూరులో శ్రీదేవి అనే ప్రీ స్కూల్ టీచర్ ఓ విద్యార్థిని తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తొలుత అతడి వద్ద నుంచి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడిపింది. అతడికి ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియో చాట్‌లను బయటపెడతానంటూ విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో చివరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేశ్‌ను అరెస్ట్ చేశారు.
News April 2, 2025
శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

హైదరాబాద్‌లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.