News April 18, 2025

సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఖైదీ మృతి

image

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.

Similar News

News April 20, 2025

రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల 

image

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

News April 20, 2025

పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో మృతదేహం 

image

మోత్కూరు మండలం పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. 

News April 20, 2025

మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

image

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

error: Content is protected !!