News April 24, 2025
సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
BSFలో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. టైలర్, కార్పెంటర్, ప్లంబర్, బార్బర్, స్వీపర్, ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్లలో 3,588 జాబ్స్ భర్తీ చేయనుంది. మెన్‌కు 3,406, ఉమెన్‌కు 182 పోస్టులను కేటాయించింది. 10th పాసై ITI సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. వయసు 18-25 ఏళ్లు. SC, ST, BC అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. <
News August 23, 2025
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
News August 23, 2025
సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.