News February 27, 2025
సంగారెడ్డిలో ఓటింగ్ శాతం ఇలా..

సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం10 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ 8.05 శాతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 12.94గా నమోదైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Similar News
News February 27, 2025
పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే: వాసుపల్లి

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. పోసాని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్, లోకేశ్ ఇద్దరి దగ్గర రెడ్ బుక్స్ ఉన్నాయన్నారు. పోసాని అరెస్టు పవన్ కళ్యాణ్ ఆలోచనే అని ఆరోపించారు.
News February 27, 2025
ఇడ్లీ సాంబార్ వల్ల తగ్గిన టూరిజం: BJP MLA

గోవా బీచుల్లో ఎక్కడపడితే అక్కడ ఇడ్లీ సాంబార్, వడాపావ్ విక్రయించడం వల్ల విదేశీ టూరిస్టులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కలాంగూట్ బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పర్యాటకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల కూడా టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోందని, దీనికి అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
News February 27, 2025
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.