News February 6, 2025

సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు

image

సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Similar News

News February 6, 2025

సంగారెడ్డి: ALERT.. 9న చివరి గడువు

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.bcstudycircle.comలో ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

News February 6, 2025

విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన

image

అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

News February 6, 2025

తీన్మార్ మల్లన్నపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

image

కాంగ్రెస్‌కి చెందిన MLC తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఫిర్యాదు చేశారు. రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను MLC పదవికి అనర్హుడిగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

error: Content is protected !!