News March 17, 2025

సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ కథనం మేరకు.. హవేలీ ఘనపూర్ నుంచి సంగారెడ్డికి వలస వచ్చిన మన్నే వినోద్ (21) కొంతకాలంగా శివాజీ, మరియమ్మ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 15న తన ఇంట్లో హత్య చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 17, 2025

కొత్త ఏడాది రాశిఫలాలు..

image

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.

News March 17, 2025

పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.

News March 17, 2025

ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేడ్చల్ కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలోని శాఖల వారీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ధి చేకూరుతుందనే జాబితాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పరిశీలించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంల లబ్ధి చేకూరుతుందని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!