News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ <<15474129>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News December 14, 2025
మహిళల కోసం 10 కాపీ షాపులు: DRDA పీడీ

మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని DRDA పీడీ ఝాన్సీరాణి పిలుపునిచ్చారు. వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 10 కాఫీ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నరసరావుపేటలో కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాఫీ షాప్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే నెలాఖరుకు వాటిని పూర్తి చేస్తామని ఆమె వివరించారు.
News December 14, 2025
భూపాలపల్లి: 9 AM 26.40 శాతం పోలింగ్ నమోదు

భూపాలపల్లి జిల్లాలో మలివిడత ఎన్నికల లో 9 గంటల వరకు 26.40 శాతం నమోదైనట్లు డిపిఓ శ్రీలత తెలిపారు. చిట్యాల 27.04 శాతం, భూపాలపల్లి 27.28 శాతం, టేకుమట్ల 23.88 శాతం, పలిమెల 28.50 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. జిల్లాలో 21,841 మంది హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో నాలుగు మండలాల్లో 82,728 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 14, 2025
ఖమ్మం: పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి మృతి

నేలకొండపల్లి మండలం అనాసాగరం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు (40) మృతి చెందారు. ఎంఎస్సీ, బీఈడీ చదివి ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. రెండో విడతలో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో విషాదం నింపింది. నామినేషన్ వేసిన రోజే అస్వస్థతకు గురైన నాగరాజును ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు బ్రెయిన్‌డెడ్ అయ్యి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.


