News April 22, 2025

సంజామల పోలీసులు నన్ను కొట్టారు: అల్లూరి రమేశ్‌

image

ఓ వ్యక్తి గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లగా పోలీసులు వాతలు పడేలా కొట్టిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో PDTR-KNL వెళ్లే బస్సును నొస్సంలో భరత్ అనే యువకుడు ఆపడంతో, కండక్టర్ శాంతతో వాగ్వాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భరత్‌ను కాకుండా తనను అకారణంగా కొట్టారని రమేశ్‌ ఆరోపించారు. బాధితుడు JMDలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో తప్పెవరిదనే నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 22, 2025

కడప జిల్లా యువతికి 494 మార్క్స్

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా యువతి సత్తా చాటింది. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన ఎద్దుల శివారెడ్డి, లక్ష్మీకొండమ్మ కుమార్తె పూజిత ఎంఈసీ చదువుతోంది. 500 మార్కులకు గాను 494 సాధించింది. ఇంగ్లిషులో 78, సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1ఏలో 50, 1బీలో 50, ఎకనామిక్స్‌లో 99, కామర్స్‌లో 98, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో 20 మార్కులతో సత్తా చాటింది. ఆమెను అందరూ అభినందించారు.

News April 22, 2025

RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

image

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.

News April 22, 2025

NGKL: BRS వాళ్లు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే

image

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వంపై BRS వాళ్లు విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి హితవు పలికారు. NGKL వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొని ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు పాల్గొన్నారు.

error: Content is protected !!