News January 7, 2025
సంతబొమ్మాళి: ఉరేసుకొని పోర్టు కార్మికుడి మృతి
సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామంలో సోమవారం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు వావిలపల్లి సురేశ్(25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మడకముడిగాం గ్రామానికి చెందిన యువకుడు పోర్టులో భోజనాలు అందించే వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని సంతబొమ్మాళి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సింహాచలం తెలిపారు.
Similar News
News January 9, 2025
తిరుపతి ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
తిరుపతిలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులు మృతి కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
News January 9, 2025
ఇచ్ఛాపురం స్వల్ప భూ ప్రకంపనలు
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
News January 8, 2025
మెళియాపుట్టిలో సినిమా షూటింగ్ సందడి
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.