News February 6, 2025

సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర బడ్జెట్: ఏఐటీయూసీ, సీఐటీయూ 

image

సంపన్నులకు దోచిపెట్టేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని వరంగల్ జిల్లా ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యదర్శులు ముక్కెర రామస్వామి, గన్నారం రమేష్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలో నిరసన చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. బడ్జెట్ కార్మికులు, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు.

Similar News

News February 6, 2025

TG భరత్‌కు 15వ ర్యాంకు

image

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.

News February 6, 2025

INDvsENG మ్యాచులో ‘పుష్ప’

image

నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా జరుగుతోన్న INDvsENG తొలి వన్డే మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందులో ఓ వ్యక్తి ‘పుష్ప-2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్‌లో వేసిన గెటప్‌తో దర్శనమిచ్చాడు. పుష్ప ఫీవర్ నాగ్‌పూర్‌ను తాకిందంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, అతనికి ఈ గెటప్ సూట్ కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతడెలా ఉన్నాడో కామెంట్ చేయండి.

News February 6, 2025

శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులకు సీఎం ర్యాంకులు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరుపై సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో శ్రీ సత్యసాయి జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్ 7, సవిత 11వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

error: Content is protected !!