News March 13, 2025

సత్తమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

image

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి సత్తమ్మ(87) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పూర్వం చేర్యాల నియోజకవర్గం సీపీఐ నాయకులు మద్దూరు మండలం నర్సాయపల్లిలో స్వగృహంలో సత్తమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 13, 2025

జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలంటూ అసెంబ్లీలో ప్రతిపాదన

image

TG: స్పీకర్‌పై <<15744584>>వ్యాఖ్యలు<<>> చేసిన జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతోంది. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. లోక్‌సభలో ప్రవర్తన నియమావళి కింద టీఎంసీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు.

News March 13, 2025

Stock Markets: మోస్తరు నష్టాల్లో ముగింపు

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరుగా నష్టపోయాయి. నిఫ్టీ 22,397 (-73), సెన్సెక్స్ 73,828 (-200) వద్ద ముగిశాయి. PSU బ్యాంకు, CPSE షేర్లు రాణించాయి. రియాల్టి, మీడియా, ఆటో, మెటల్, వినియోగం, తయారీ, ఇన్ఫ్రా, ఐటీ, కమోడిటీస్, హెల్త్‌కేర్, ఫార్మా షేర్లు విలవిల్లాడాయి. BEL, SBI, NTPC, సిప్లా, ICICI బ్యాంకు టాప్ గెయినర్స్. శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటో, టాటా మోటార్స్, HDFC లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ లూజర్స్.

News March 13, 2025

నల్గొండ: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: SP 

image

జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముందస్తుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. హోలీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు ఫైల్ కావడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.

error: Content is protected !!