News August 1, 2024

సత్తాచాటిన కామారెడ్డి జిల్లా వాసులు.. సీఎం సన్మానం

image

కోల్‌కతాలో ఇటీవల జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్ విభాగంలో తక్కడ్‌పల్లి ప్రతిభ 5 గోల్డ్‌మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. బాన్సువాడకు చెందిన రుషాంక్ సబ్ జూనియర్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ విభాగంలో పిట్లంకు చెందిన విజయ్‌ రాఘవేంద్ర రావు 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.

Similar News

News February 7, 2025

నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.

News February 7, 2025

NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్  

image

రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

News February 6, 2025

NZB: రైలులోంచి పడి యువకుడు మృతి

image

రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌‌‌కు సంప్రదించాలన్నారు.

error: Content is protected !!