News February 23, 2025

సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన

image

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేస్-2 సంబంధించిన కాలువ మ్యాప్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో హంద్రీనీవా సుజల స్రవంతి అధికారులు, 2వ విడతలో చేపట్టాల్సిన పనుల గురించి మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్-2 పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

Similar News

News February 23, 2025

6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.

News February 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

News February 23, 2025

జనగామ: గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు(ఆదివారం) జరిగిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరయ్యారని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,851 మంది 1,800 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 5వ తరగతిలో 16 మంది, 6వ తరగతిలో 14 మంది, 7వ తరగతిలో 12 మంది, 8వ తరగతిలో ఐదుగురు, 9వ తరగతిలో నలుగురు గైర్హాజరు అయ్యారని వెల్లడించారు.

error: Content is protected !!