News April 5, 2025
సత్యసాయి: జగ్జీవన్ చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్నతోపాటు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 6, 2025
విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వనం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7,8న పోర్చుగల్‌లో 9,10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఈ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
News April 6, 2025
BREAKING: టాస్ గెలిచిన GT

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ
News April 6, 2025
కంచంలో సన్నబియ్యం.. కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా: CM

TG: భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలో ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’ అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను జతపరిచారు.