News April 1, 2025
సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. గోరంట్ల మండలం ఎముకలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 3, 2025
కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్ & కొణతం దిలీప్‌లపై కేసు నమోదు చేశారు.
News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 3, 2025
వనపర్తి: ఆరోగ్య నియమాల గోడపత్రికను విడుదల చేసిన కలెక్టర్

మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తమ జీవన విధానంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను గురువారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ.శ్రీనివాసులు, ఎన్‌సీడీ రామచంద్రరావు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.