News June 22, 2024
సత్యసాయి: భూ సేకరణపై జేసీ సమావేశం
శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణపై జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ సబ్ కలెక్టర్‌తో కలిసి పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీవోలతో పాటు సంబంధిత మండలాల తహాసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
Similar News
News January 3, 2025
శ్రీ సత్యసాయి: పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో ఎనుము పుర్రెను పెట్టి పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాడిమర్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News January 3, 2025
పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించండి: కలెక్టర్
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.
News January 2, 2025
శ్రీ సత్యసాయి కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.