News March 19, 2025
సత్యసాయి: వినియోగదారులకు అందుబాటులో ఇసుక

ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచుదామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహాలకు ఆనుకుని ఉన్న గ్రామాలలో గృహాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్ళవచ్చునన్నారు.
Similar News
News March 19, 2025
VZM: “టెన్త్ పరీక్షకు 94 మంది గైర్హాజరు”

బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో యు.మాణిక్యం నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకి మొత్తం 22,834 విద్యార్థులకు గాను 22740 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా జరిగిందని తెలియజేశారు.
News March 19, 2025
P4పై తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం

పేదరిక నిర్మూలన కోసం తలపెట్టిన P4 పాలసీ(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్ షిప్)ని ఈ నెల 30 న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని కలెక్టర్ వేంకటేశ్వర్ తెలిపారు మేధావులు, ఎన్జీఓలు, సామాజిక సేవకులు పాల్గొనాలని కోరారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
News March 19, 2025
ఎగుమతుల పెంపునకు కృషి: మంత్రి కొండపల్లి

విశాఖలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సాధికారత సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. MSME రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. MSMEలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల,ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలన్నారు. కేంద్ర ప్రభుత్వ Viksit Bharat 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.