News July 24, 2024

సదాశివనగర్: 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగలేదు: NHAI

image

సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామశివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం హైవే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగలేదని, ఒక ఇనుప పట్టి విరిగిందని, దాని పక్కన ఉన్న డాంబర్ వర్షపు తాకిడికి లేచిందని అధికారులు తెలిపారు.

Similar News

News February 7, 2025

NZB: మృత్యువులోనూ వీడని స్నేహం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా <<15383679>>ఆటో, లారీ ఢీకొని<<>> మాక్లూర్‌కు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 7, 2025

NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్

image

నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.

News February 7, 2025

NZB: ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి: స్రవంతి

image

నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు, ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 12నుంచి 14వరకు ఉంటుందన్నారు. వివరాలకు 86390 02255ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!