News February 7, 2025
సమాచారం ఇస్తే రూ.5 వేలు: ములుగు SP
పంట రక్షణ నెపంతో చేను చుట్టూ కరెంటు పెట్టిన వారి సమాచారం అందిస్తే రూ.5 వేలు బహుమతి ఇవ్వడం జరుగుతుందని ములుగు ఎస్పీ శబరిశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పంట రక్షణ కోసం, పందుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చడం ద్వారా విషాద ఛాయలు మిగులుతాయన్నారు. విద్యుత్ పెట్టిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్, 105 ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.
Similar News
News February 7, 2025
NRPT: ఐదుగురిపై కేసు నమోదు
సురక్షిత ప్రయాణానికి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్ఐ రేవతి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని పలు కోడెలలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 36 వాహనాలకు రూ.12,520 జరిమానాలు, పెండింగ్లో ఉన్న 61 వాహనాల జరిమానాలు వసూలు చేసినట్లు చెప్పారు. ఐదుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
News February 7, 2025
సినిమా రంగంలో కురవి కుర్రాడు!
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.