News January 1, 2025
సమీపిస్తున్న మినీ మేడారం జాతర!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
Similar News
News January 6, 2025
HNK: నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న మంత్రులు
హనుమకొండ న్యూ బస్ స్టేషన్లో నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రెండవ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
News January 6, 2025
ALERT.. WGL: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా జనగామ పట్టణంలో మాంజా కోసుకుని నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే.
News January 6, 2025
వరంగల్: బాధితుడిని 6 కి.మీ మోసుకెళ్లిన 108 సిబ్బంది
వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవి ప్రాంతంలోని చెలిమెల గుట్టల్లో ప్రెషర్బాంబు పేలి బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. అతనితో ఉన్న కుర్సం ఎడమయ్య, సోడి నర్సింహరావులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారి వద్దకు అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 6 కి.మీ జోల కట్టి బాధితుడిని అంబులెన్స్ సిబ్బంది వినోద్, మరొక వ్యక్తి మోసుకెళ్లారు.