News February 11, 2025

సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అసవరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మాఘ పౌర్ణమి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News February 11, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు <>jeemain.nta.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతనెల 22 నుంచి 29 వరకు జరిగిన తొలి సెషన్ ఎగ్జామ్స్‌కు 12.5 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News February 11, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.

News February 11, 2025

మాజీ క్రికెటర్‌కు సైబర్ నేరగాళ్ల ట్రాప్

image

సైబర్ నేరగాళ్లు తనను ట్రాప్ చేసేందుకు యత్నించారని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌ ట్విటర్లో తెలిపారు. ‘రూ.25వేలు కావాలంటూ ఓ సన్నిహితుడి నంబర్ నుంచి నాకు సందేశం వచ్చింది. అతడి ఫోన్ హ్యాక్ అయిందని నాకు ముందే తెలుసు. జీ పేలో పంపితే ఓకేనా అని అడిగాను. ఓ నంబర్ పంపించి పేమెంట్ స్క్రీన్ షాట్ కావాలన్నాడు. రూ.25వేలు సరిపోతాయా రూ.2.5 లక్షలు పంపించనా అని అడిగాను. ఇక మళ్లీ మెసేజ్ రాలేదు’ అని వెల్లడించారు.

error: Content is protected !!