News April 16, 2025
సమ్మర్ హలిడేస్.. ప్రకృతి అందాలకు సిక్కోలు నెలవు

వేసవి సెలవుల్లో కుటుంబసమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు సిక్కోలు జిల్లాలో ప్రకృతి అందాలెన్నో ఉన్నాయి. జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని జీడి, మామిడి, పనస తోటలు కేరళను తలపిస్తాయి. బారువ బీచ్, లైట్హౌస్, హిరమండలం గొట్టాబ్యారేజ్, శాలిహుండం బౌద్ధ స్తూపాలు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మనాథుడి దేవస్థానాలు, మూలపేట పోర్టు, కళింగపట్నం బీచ్ లైట్ హౌస్ ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.
Similar News
News April 19, 2025
సోంపేట: బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం బారువా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పర్యాటకులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జెసీ, ఆర్డీఓ తదితరులు ఉన్నారు.
News April 18, 2025
టెక్కలిలో చారిత్రాత్మక కట్టడాలలో కొన్ని ఇవే..

టెక్కలి చరిత్ర తెలిసే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం పూర్వం టెక్కలిలో రాజుల పరిపాలనలో ఉన్న రాజుగారి కోట, కోట భవనాలు, మిస్సమ్మ బంగ్లా, పురాతన ఆలయాలు టెక్కలిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం సీతానగరం వద్ద బ్రిటీష్ కాలం నాటి ముసళ్ల ఖానా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మండు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. WORLD HERITAGE DAY
News April 18, 2025
బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్లో భాగంగా బీచ్లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.